Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కికు 'చిరంజీవి' జోరు.. 2 రోజుల్లో రూ.1.8 కోట్ల గ్రాస్!

కికు 'చిరంజీవి' జోరు.. 2 రోజుల్లో రూ.1.8 కోట్ల గ్రాస్!

TeluguBulletin.com 3 weeks ago

కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు నమోదు చేస్తున్న నేపథ్యంలో కికు 'చిరంజీవి' కూడా అదే జోరును కొనసాగిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.

రక్షాబంధన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్‌కు మంచి స్పందన లభిస్తోందని మేకర్స్ వెల్లడించారు.

మేకర్స్ తెలిపిన వివరాల ప్రకారం, విడుదలైన తొలి రెండు రోజుల్లోనే కికు 'చిరంజీవి' రూ.1.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇదే ఊపు కొనసాగితే తొలి వారంలో మరింత మెరుగైన వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

వినూత్నమైన కథ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, యాక్షన్, రొమాన్స్, భావోద్వేగాల సమతుల్య మేళవింపు ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో కొత్త తరహా అనుభూతిని ఈ సినిమా అందిస్తోందని, సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోందని పేర్కొన్నారు.

కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మించిన ఈ చిత్రానికి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. కికు యనమల ప్రధాన పాత్రలో నటించగా, కశిష్ ఖాన్ కథానాయికగా కనిపించారు. ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గిరీష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఆగస్టు 28న విడుదలైన కికు 'చిరంజీవి' రక్షాబంధన్ వీకెండ్‌లో ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని, థియేటర్లలో వస్తున్న స్పందన తమకు మరింత ఉత్సాహాన్నిస్తోందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin