Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూటమి ఐక్యతే బలం.. భీమవరంలో డా. మల్లేశ్వరికి నాగబాబు మద్దతు

కూటమి ఐక్యతే బలం.. భీమవరంలో డా. మల్లేశ్వరికి నాగబాబు మద్దతు

భీమవరం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరడం ఖాయమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులతో పాటు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి డా.

మల్లేశ్వరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. "నేను, నువ్వు" అనే భావనలకు స్వస్తి పలికి, "మనం" అనే స్ఫూర్తితో కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు.

భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో నాగబాబు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అభ్యర్థుల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భీమవరం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపించే దిశగా పనిచేస్తామని నాగబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా డంపింగ్ యార్డు సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి భీమవరాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. కూటమి పార్టీల మధ్య ఎలాంటి విభేదాలకు తావులేకుండా అందరూ ఐక్యంగా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin