యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'ముగ్గురు కోతులు' సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రబృందం తాజాగా టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది.
పాటలో కనిపించిన ఎనర్జీ, వినోదాత్మక ప్రెజెంటేషన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇటీవల విడుదలైన 'ముగ్గురు కోతులు' టైటిల్ సాంగ్‌లో ముగ్గురు హీరోలు బ్యాచిలర్ జీవితాన్ని సరదాగా ఆస్వాదిస్తూ కనిపించారు. సింగిల్ లైఫ్, ఫ్రెండ్‌షిప్, యువత సరదాలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట సినిమాకు ఉన్న ఫన్ ఎలిమెంట్‌ను స్పష్టంగా చూపిస్తోంది. యూత్‌ను ఆకట్టుకునే బీట్, క్యాచీ ట్యూన్, సరదా విజువల్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ పాటకు జగదీష్ బుసయవలస సాహిత్యం అందించగా, చైతన్య గన్నవరపు తన గాత్రంతో మరింత ఉత్సాహాన్ని జోడించారు. సంగీత దర్శకుడు ఎస్. సుహాస్ అందించిన ట్యూన్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోందని, త్వరలోనే టీజర్‌తో పాటు మరిన్ని అప్డేట్స్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సినిమాటోగ్రఫీని రాజ్ నోముల, ఎడిటింగ్‌ను జమీర్ షేక్ నిర్వహిస్తున్నారు.
కొత్త తరం నటీనటులు, యూత్‌ఫుల్ కథ, సరదా సన్నివేశాలతో రూపొందుతున్న 'ముగ్గురు కోతులు' సినిమా యువ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఫన్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
https://youtu.be/bCW6ndObGic?si=6AO4kCjmPvlNOFFy

