Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Narayana Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు నారాయణ రావు కన్నుమూత

Narayana Rao: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు నారాయణ రావు కన్నుమూత

TeluguBulletin.com 2 weeks ago

Narayana Rao: ప్రముఖ సినీ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కెరీర్లో 100కు పైగా సినిమాల్లో ఆయన నటించారు. పలు తెలుగు సీరియల్స్ లో కూడా నటించారు.

కృష్ణజిల్లాలోని కురుమద్దాలి ఆయన స్వగ్రామం. ఆయన బాల్యం, విద్యాబ్యాసం అంతా గుంతకల్లులో సాగింది. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అంతులేని కథ' సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. సినిమాలో మిమిక్రీ చేస్తూ నటించిన మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో తొలి సినిమాతోనే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సైతం అందుకున్నారు. చదువుకునే రోజుల్లో ఆయన మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర వంటి నాటకాల్లో నటించారు.

నారాయణరావు అంటే టక్కున గుర్తొచ్చేది చిరంజీవి స్నేహితుడిగా. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకునే రోజుల్లో చిరంజీవి, హరిప్రసాద్, కమెడియన్ సుధాకర్, నారాయణరావు కలిసి కోచింగ్ తసుకుని రూమ్మేట్స్ గా ఉండేవారు. శిక్షణ అనంతరం వచ్చిన అవకాశాలతో అందరూ నటులుగా మారారు. రజినీకాంత్ కు కూడా నారాయణరావు మిత్రుడే. వీరంతా ఒకే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధులు. 1987లో నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్ కలిసి 'డైనమిక్ మూవీ మేకర్స్' నిర్మాణ సంస్థను స్థాపించి చిరంజీవితో సినిమా నిర్మించారు. అదే.. 'యముడికి మొగుడు'. చిరంజీవి కెరీర్లో ఉన్న ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. స్నేహితులుగా కలిసి నిర్మించిన సినిమా వన్ మూవీ వండర్ గా నిలిచిపోయింది.

నటుడిగానే కాకుండా ఆయన సొంతంగా నిర్మాతగా మరికొన్ని సినిమాలు నిర్మించారు. చిరంజీవితో దేవాంతకుడుతోపాటు ఇంటికో రుద్రమ్మ, పెళ్లి నీకు శుభం నాకు సినిమాలు నిర్మించారు. పలు సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. నారాయణరావు భరతనాట్యం, కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యులు. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు నారాయణరావుకు రంగస్థలంలో స్నేహితులు. నారాయణరావు మృతిపట్ట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సంతాపం తెలిపింది. నారాయణరావు మృతిని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియాలో వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin