Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయ పరంపర కొనసాగాలి: పవన్ కళ్యాణ్

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయ పరంపర కొనసాగాలి: పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లోనూ మున్సిపాలిటీ, పరిషత్ ఎన్నికల విజయోత్సాహాన్ని కొనసాగించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 26న జరగనున్న నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని స్థాయిల్లో పార్టీ యంత్రాంగం సన్నద్ధంగా పనిచేస్తోందని తెలిపారు.

సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా గ్రామాల్లో సామరస్యపూర్వక వాతావరణం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

కూటమి పక్షాల ఐక్యతకు ఈ ఎన్నికలు నిదర్శనంగా నిలవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి నాయకులు, కార్యకర్తలు వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin