Thursday, 16 Sep, 10.54 pm TeluguBulletin.com

హోమ్
పండగ టైటిల్ తో రానున్న నాని

న్యాచురల్ స్టార్ నాని హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేసే హీరో. కుదిరితే 3 లేదంటే 2 సినిమాలను ఏడాదికి కచ్చితంగా అందిస్తాడు. ఈ ఏడాది ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటిలో విడుదల చేసిన నాని దాని నెక్స్ట్ చిత్రం శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసాడు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంతే కాకుండా ప్రస్తుతం అంటే సుందరానికి చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాని దసరా పండగకి తన నెక్స్ట్ చిత్రాన్ని విడుదల చేస్తానని ఇప్పటికే తెలియజేసాడు.

ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి దసరా అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin
Top