Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పర్సంటేజ్  వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో ప్రస్తుతం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన 'శాతాల విధానం' (Percentage System) పై విస్తృతంగా చర్చించారు. ప్రదర్శక రంగానికి సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిశీలించి, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనే దిశగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీకి పరిశ్రమలో అనుభవజ్ఞులైన ప్రముఖులు మార్గదర్శకత్వం వహించనున్నారు. ఉప కమిటీ ఛైర్మన్‌గా శ్రీ డి. సురేష్ బాబు వ్యవహరించనుండగా, సీనియర్ నిర్మాత శ్రీ అల్లు అరవింద్, మాజీ అధ్యక్షుడు శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు), సీనియర్ నిర్మాత డాక్టర్ కె. ఎల్. నారాయణ సభ్యులుగా ఉంటారు. గౌరవ కార్యదర్శి శ్రీ కె. అశోక్ కుమార్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇక పరిశ్రమలోని మూడు విభాగాలకు చెందిన ప్రతినిధులను కూడా ఉప కమిటీలో సభ్యులుగా నియమించారు.

నిర్మాత రంగం నుంచి:

  1. శ్రీ వై. సురేందర్ రెడ్డి
  2. శ్రీమతి వై. సుప్రియ
  3. శ్రీ వై. రవి శంకర్
  4. శ్రీ బి. బాపినీడు
  5. శ్రీ చెరుకూరి సుధాకర్
  6. శ్రీ జి. శ్రీనివాస్ కుమార్ (SKN)
  7. శ్రీ టి. ప్రసన్న కుమార్

ప్రదర్శక రంగం నుంచి:

  1. శ్రీ వి. ప్రతాప్ రెడ్డి
  2. శ్రీ టి. బాల్గోవింద్ రాజ్
  3. శ్రీ కె. అనుపమ్ రెడ్డి
  4. శ్రీ పి. శ్రీనివాస రావు
  5. శ్రీ జి. వీరనారాయణ బాబు
  6. శ్రీ కె. వంశీ కిషోర్ (చిన్ని)
  7. శ్రీ ఎం. విజేందర్ రెడ్డి

పంపిణీ రంగం నుంచి:

  1. శ్రీ డి. విష్ణు మూర్తి
  2. శ్రీ వి. వీరనాయుడు
  3. శ్రీ ఎన్. సుధాకర్ రెడ్డి
  4. శ్రీ ముత్యాల రామదాసు
  5. శ్రీ ఎన్. నాగార్జున
  6. శ్రీ బి. మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు)
  7. శ్రీ ధీరజ్ మొగిలేని

పరిశ్రమలో కొంతకాలంగా కొనసాగుతున్న శాతాల విధానంపై వివాదానికి ఈ ఉప కమిటీ కీలక పరిష్కారం చూపిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు, పంపిణీదారుల మధ్య సమన్వయం పెంచి, తెలుగు సినిమా వ్యాపార వ్యవస్థను మరింత స్థిరంగా మార్చే దిశగా ఈ కమిటీ పని చేయనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin