Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi: పైరసీ నుంచి 'పెద్ది'కి రక్షణ..! మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ

Peddi: పైరసీ నుంచి 'పెద్ది'కి రక్షణ..! మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ

TeluguBulletin.com 4 months ago

Peddi: రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమాకు పెద్ద ఊరట లభించింది. సినిమా పైరసీకి గురి కాకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 'పెద్ది'కి యాంటీ-పైరసీ ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది.

నిర్మాతలు సినిమా కాపీరైట్ కు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ యాంటీ ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఆదేశాలతో 'పెద్ది' సినిమాకు అక్రమంగా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, యూఆర్ఎల్ క్రియేట్ చేసి ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ ఆదేశాలిచ్చింది.

సినిమా అనేది నిర్మాతలు కోట్లు పెట్టే నష్టం. దీనిని అక్రమంగా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసి ప్రసారం చేయడం నిర్మాతకు భారీ నష్టాన్ని మిగుల్చుతుంది. అందుకే ఈ ఆర్డర్ ఇస్తున్నామని కోర్టు అభిప్రాయపడింది. ఈ 'యాంటీ పైరసీ ఇంజంక్షన్' ద్వారా కాపీరైట్ హక్కుదారులైన నిర్మాతలు తమ కంటెంట్ సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అక్రమంగా కాపీకి గురికాకుండా, పైరసీ వెబ్ సైట్లలో అప్లోడ్ కాకుండా కాపాడే ఒక రక్షణ. ఎవరైనా దీనిని అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఒకవేళ ఓ వెబ్ సైట్లో అప్లోడ్ చేసిన కంటెంట్ గుర్తించి బ్లాక్ చేసాక మరో యూఆర్ఎల్ క్రియేట్ చేస్తూంటారు పైరసీదారులు.

అలా అప్లోడ్ చేసిన కంటెంట్ ను కూడా ఆటోమెటిక్ గా బ్లాక్ చేసేందుకు ఇంజంక్షన్ ఉత్తర్వులను కోర్టులు జారీ చేస్తుంటాయి. ఈక్రమంలో 'పెద్ది' నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులిచ్చింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం టీమ్ మొత్తం ప్రమోషన్లతో బిజీగా ఉంది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించిన సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు అందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin