Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi: 'పెద్ది' ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: 'పెద్ది' ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది'పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే 18న విడుదలవుతోంది.

ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ చూసారు మెగాస్టార్. ఆయన సోషల్ మీడియాలో చెప్పిన ఒపీనియన్ తో హైప్ మరింత పెరిగిపోయింది. పైగా, కొందరు జర్నలిస్టులు కూడా ట్రైలర్ చూసి ఎగ్జైట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా 'పెద్ది' ట్రైలర్ తోనే సంబరాలు మొదలెట్టడం ఖాయమని అంటున్నారు. అయితే.. ఇప్పుడీ 'పెద్ది'పై ఓ ఆసక్తికరమైన వాదన చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య తిరుగుతోంది.

సినిమా కథ మొదట ఎన్టీఆర్ కు చెప్పారా..? తను కాదంటే చరణ్ తో తెరకెక్కించారా..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. రెండు రోజుల నుంచీ దర్శకుడు బుచ్చిబాబు అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఈ ప్రశ్న లేకపోయినా కూడా సోషల్ మీడియాలో అయితే అదే ప్రశ్న రౌండ్ అవుతోంది. కానీ.. బుచ్చిబాబు మాత్రం 'ఉప్పెన' విడుదలకు ముందే 'తాన రెండో సినిమా రామ్ చరణ్ తో చేయాలని, హీరో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తాడని' రాసుకున్నట్టు స్పష్టంగా చెప్పుకొచ్చారు. అందుకు తగిన స్క్రీన్ షాట్ కూడా తన వద్ద ఉందని అన్నారు. చరణ్ కు కథ చెప్పగానే చేస్తున్నామని చెప్పినట్టు చెప్పారు.

నిజానికి ఈ కథ చరణ్ కు చెప్పిన తర్వాత వరుస సినిమాలు ఆర్ఆర్ఆర్, ఆచార్య, గేమ్ చేంజర్ తో బిజీ ఉన్నారని అందుకే ఆలస్యమైందని అన్నారు. ఉప్పెన తర్వాత సినిమా ఏంటని బుచ్చిబాబును అడిగితే చరణ్ తో.. అన్నాడని చెప్పారు సుకుమార్ ఆమధ్య. అంటే మొదటగా ఈ కథ చరణ్ వద్దకే వెళ్లిందనేది సుస్పష్టం. అయితే.. ఇండస్ట్రీలో మరో వాదన ఏంటంటే.. చరణ్ బీజీ ఉండటంతో ఈ కథను ఎన్టీఆర్ కు కూడా చెప్పినట్టు.. కానీ, ఆయన వార్-2 చేయడంతో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని టాక్. మొత్తంగా కథ తొలిసారి విన్న చరణ్ వద్దకే వెళ్లడం ఆయన ఓకే చేయడం.. సినిమా పూర్తై విడుదలకు సిద్ధమవడం జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin