రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ హైప్ తీసుకురాగా, ఇప్పుడు మూవీ రన్‌టైమ్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం 'పెద్ది' ఫైనల్ రన్‌టైమ్ 3 గంటల 2 నిమిషాలుగా లాక్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం పూర్తి స్థాయిలో "చరణ్ షో"గా నిలవబోతోందని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు సానా ఎమోషనల్ టేకింగ్, భారీ నిర్మాణ విలువలు సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని అంటున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో భావోద్వేగాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది.
క్రికెట్, రెజ్లింగ్ వంటి స్పోర్ట్స్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ మాస్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారనే సమాచారం ఉంది. గ్రామీణ నేపథ్యంతో ఓ క్రీడాకారుడి ఎదుగుదల కథను భారీ స్థాయిలో తెరకెక్కించారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ హిట్‌గా 'పెద్ది' నిలిచే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

