Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. నిన్న విడుదలైన ట్రైలర్ దేశవ్యాప్తంగా విధ్వంసమే సృష్టించింది.
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలతోనే ట్రైలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అలా ట్రైలర్ విడుదలైందో లేదో ఇలా రికార్డులకు ఊపిరి లేకుండా చేస్తోంది. విడుదలకు ఇంకా 15రోజులు సమయం ఉంది. ఈక్రమంలో ట్రైలర్ సృష్టించిన ప్రభంజనంతో సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. పెద్ది బీభత్సాన్ని చూస్తే..
దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ట్రైలర్ 24గంటల్లో ఏకంగా 101 మిలియన్ వ్యూస్ దక్కించుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరే ఇతర భారతీయ భాషా సినిమా కేవలం 24గంటల్లో ఇంతటి వ్యూవర్ షిప్ సాధించలేదు. ఒక్క తెలుగులోనే ట్రైలర్ రికార్డు చూసుకుంటే 24గంటల్లో 49మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటివరకూ ఆ రికార్డు పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'.. 47 మిలియన్ వ్యూస్, తర్వాత రికార్డు 44 మిలియన్ వ్యూస్ తో అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 పేరుతో ఉంది.
అంచనాలు అందుకున్న 'పెద్ది' ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ టాప్ లో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. రామ్ చరణ్ మేకోవర్, మూడు పాత్రల్లో ట్రాన్స్ ఫర్మేషన్, కీలక సన్నివేశాల్లో నటన.. ట్రైలర్ లో అదరగొట్టేసింది. అయినా.. ఇంకా సినిమాలో మరేదో ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు మెయిన్ కథ ఇంకా రివీల్ కాలేదనే తెలుస్తోంది. మరో ట్రైలర్ రిలీజ్ చేద్దామని నిర్మాత అంటున్నా దర్శకుడు ఇది చాలు.. మిగిలిన మెయిన్ కంటెంట్ సినిమాలోనే చూపిద్దామని అంటున్నారని సోషల్ మీడియా టాక్. మరి బుచ్చిబాబు ఏం మ్యాజిక్ చేశాడో చూడాలంటే జూన్ 4వరకూ ఆగాల్సిందే. సోషల్ మీడియాలో #PEDDITRAILERTAKEOVER హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.

