రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన మెగాస్టార్ Chiranjeevi చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
చాలా రోజుల తర్వాత మరోసారి తన స్టైల్‌లో "చీరూ లీక్స్" ఇస్తూ అభిమానుల్లో మరింత హైప్ పెంచేశారు.
'#PeddiTrailer చూసాను.. జస్ట్ వావ్' అంటూ ప్రారంభించిన చిరంజీవి, మూడు నిమిషాల ట్రైలర్‌ను "ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్"గా అభివర్ణించారు. రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు A. R. Rahman ముగ్గురూ తమ బెస్ట్ ఇచ్చారని, కలిసి మాత్రం రఫ్ఫాడించేశారని ప్రశంసించారు.
ఇక చాలా రోజుల తర్వాత అభిమానులకు "#ChiruLeaks" ఇస్తున్నానంటూ సరదాగా కామెంట్ చేసిన చిరంజీవి.. ట్రైలర్‌లోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను కూడా బయటపెట్టారు. "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు…" అనే డైలాగ్‌ను షేర్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తి పెంచారు.
చివర్లో "సారీ బుచ్చిబాబు.. చూసాక కంట్రోల్ తప్పా!" అంటూ చిరంజీవి చేసిన కామెంట్ అభిమానులను మరింత ఎంటర్‌టైన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, 'పెద్ది'పై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రామ్ చరణ్ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా తెరకెక్కుతున్న 'పెద్ది'పై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్ విడుదలకు ముందే ఈ స్థాయిలో హైప్ రావడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

