Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇటివలే ముంబై వేదికగా సినిమా ట్రైలర్ విడుదల చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. జూన్ 4న విడుదలయ్యే సినిమా ప్రమోషన్లో భాగంగా ఈనెల 23న భోపాల్ లో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలిసి సినిమా ప్రమోషన్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా 'Driving Through Peddi Memories' పేరుతో కారులో సరదాగా షికారు చేస్తూ సినిమా ముచ్చట్లను పంచుకుంటున్నారు రామ్ చరణ్-బుచ్చిబాబు.

