Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పూజలో వెలిగించిన దీపమే ప్రమాదం.. బీహార్‌లో మర్రిచెట్టుకు మంటలు

పూజలో వెలిగించిన దీపమే ప్రమాదం.. బీహార్‌లో మర్రిచెట్టుకు మంటలు

Patnaలోని ఫతూహా బ్లాక్ కార్యాలయ సమీపంలో నిర్వహించిన వట్ సావిత్రి పూజ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పూజలో భాగంగా వెలిగించిన దీపం కారణంగా అక్కడి పురాతన మర్రిచెట్టుకు మంటలు అంటుకోవడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శనివారం ఉదయం మహిళలు వట్ సావిత్రి పూజ నిర్వహిస్తున్న సమయంలో చెట్టు చుట్టూ కట్టిన పొడి దారాలకు దీపం మంట తగిలినట్లు తెలుస్తోంది. దీంతో క్షణాల్లోనే చెట్టు అడుగు భాగంలో మంటలు వ్యాపించాయి. అక్కడున్న భక్తులు భయంతో పరుగులు తీయగా, కొందరు వీడియోలు చిత్రీకరించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీరు పోసి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం ఊరటనిచ్చింది. అయితే చెట్టు అడుగు భాగం కాలిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర వృక్షానికి నిర్లక్ష్యంగా దీపాలు ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రకృతిని పూజించే వారు అదే చెట్టుకు నిప్పంటించడం బాధాకరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో పూజల సమయంలో అగ్ని వినియోగంపై మరింత జాగ్రత్త అవసరమని పలువురు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin