Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పుష్పను వదలని లీకుల గోల..! ఇది కూడా లీక్ చేసేశారు..!!

పుష్పను వదలని లీకుల గోల..! ఇది కూడా లీక్ చేసేశారు..!!

TeluguBulletin.com 5 years ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ఫ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే.. ఈ సినిమాకు సంబంధించి లీకులు యూనిట్ ను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ బన్నీ లుక్ తోపాటు చిత్రంలోని పలు సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు చాలా లీక్ అయ్యాయి. ఈ లీకులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి..

ప్రస్తుతం పుష్ఫ సినిమా కాకినాడ, మారేడుమిల్లి అడవిలో షూటింగ్ జరుపుకుంటోంది. బన్నీ, రష్మికపై సన్నివేశాలు, ఫైట్ చిత్రీకరణ చేస్తున్నారు. అయితే.. ఔట్ డోర్ షూటింగ్ కావడంతో పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు. దీంతో లీకులు తప్పించడం యూనిట్ కు కష్టంగా మారింది. ఏకంగా.. 'ఫొటోలు, వీడియోలు తీసినచో సెల్ ఫోన్లు పగులగొట్టబడును' అని రాసున్న పోస్టర్ ను కూడా వదలకుండా వైరల్ చేయడం పరిస్థితికి నిదర్శనంగా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా గ్రాండ్ గా నిర్మిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin