Dailyhunt
రామాయణం టీజర్‌లో వైభవం ఉంది. దైవత్వం ఎంత ఉంది?

రామాయణం టీజర్‌లో వైభవం ఉంది. దైవత్వం ఎంత ఉంది?

న్నో అంచనాల మధ్య రామాయణం teaser విడుదలైంది. Ranbir Kapoor, Sai Pallavi, Yash, A.R. Rahman, Hans Zimmer, DNEG… ఇలాంటి పెద్ద పేర్లు కలిసొచ్చినప్పుడు సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పతాక స్థాయిలో ఉంటాయి.

teaser వస్తుంది అని తెలిసినప్పటి నుంచి ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ప్రతి సినీ అభిమానికి ఉంది అనడంలో సందేహం లేదు. మరి teaser ఆ అంచనాలను అందుకుందా అంటే - కొంతవరకు మాత్రమే అందుకుంది అనిపించింది. సోషల్ మీడియాలో కూడా దీనికి మిశ్రమ స్పందనే కనిపించింది.

అయితే ఇది కేవలం teaser చూసిన తర్వాత ఏర్పడిన మొదటి అభిప్రాయం మాత్రమే. పూర్తి సినిమా చూసిన తర్వాత భావన మారొచ్చు. మారాలని కూడా కోరుకోవాలి. ఎందుకంటే ఇది సాధారణ సినిమా కాదు - రామాయణం.

రామాయణం అంటే ఒక అద్భుత కావ్యం. మనిషి ఎలా ఉండాలో చెప్పే ఒక దిక్సూచి. అలాంటి కావ్యాన్ని తెరపైకి తీసుకువస్తున్నప్పుడు అవసరం కేవలం VFX, international music, భారీ సెట్లు మాత్రమే కాదు - ముందుగా కావాల్సింది భక్తి భావన. చూసే ప్రేక్షకుడికి ఆ ఆధ్యాత్మిక అనుభూతి కలగాలి.

ఈ మధ్యకాలంలో చాలా మంది makers ఆ మూల భావనను పక్కన పెట్టి హంగుల మీద ఎక్కువగా ఆధారపడుతున్నట్టు అనిపిస్తోంది. అలా అని VFX, scale అవసరం లేదని కాదు. కానీ సీన్ లో emotion పండితే, అదే VFX ఆ సీన్ ని మరో స్థాయికి తీసుకెళ్తుంది. emotion లేకుండా visuals మాత్రమే ఉంటే, అవి కేవలం ప్రదర్శనగా మిగిలిపోతాయి.

అందుకే teaser చూసిన తర్వాత అసలు ఆలోచించాల్సింది - ఇందులో ఆ భావం ఉందా? ఆ దైవత్వం కనిపించిందా? అన్నది.
అంతే కానీ, అవసరం లేని పోలికలు తీసుకురావడం కాదు.

కొసమెరుపు ఏమిటంటే, ఈ teaser చూసిన వాళ్ళలో కొందరు teaser ని ప్రశంసించే క్రమంలో, రెండేళ్ల క్రితం వచ్చిన మరో సినిమాను మళ్లీ బయటకు తీసి, తగ్గించి మాట్లాడుతూ అప్పటి చర్చలను తిరిగి లాగడం జరిగింది. దీంతో సదరు హీరో ఫాన్స్ కూడా ఈ పోలిక ఇప్పుడు తీసుకురావడాన్ని సోషల్ మీడియా లో తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.

నిజంగా రామాయణాన్ని దైవత్వంతో, పవిత్రతతో తరతరాలకు చూపించాలి అనుకుంటే - ఇప్పటికీ మన తెలుగు లో వచ్చిన సంపూర్ణ రామాయణం, లవ కుశ వంటి చిత్రాలు ముందు వరుసలో నిలుస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin