Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

రమణి కళ్యాణం ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్.. ఫీల్‌గుడ్ ప్రేమకథపై పెరిగిన ఆసక్తి

మధ్యకాలంలో భారీ యాక్షన్‌, మాస్ హంగామా కంటే హృదయానికి దగ్గరయ్యే క్లీన్ ఎమోషనల్ కథల వైపు ప్రేక్షకులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూసేలా ఉండే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

అలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రమణి కళ్యాణం సినిమా తన ట్రైలర్‌తో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

ఇప్పటికే టీజర్‌, టైటిల్ సాంగ్‌తో ఆసక్తి పెంచిన ఈ సినిమా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో మరింత హైలైట్ అయింది. "కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది" అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ మొదటి క్షణం నుంచే భావోద్వేగాలతో ఆకట్టుకుంటోంది.

సంజన అనే RJ మరియు సింగర్ పాత్రలో కనిపించే హీరోయిన్‌కు చూపు ఉండదు. మరోవైపు రాజ్ అనే పాత్ర నడవలేని పరిస్థితిలో ఉంటాడు. ఈ ఇద్దరి జీవితాలు ఎలా కలిశాయి? వారి మధ్య ప్రేమ ఎలా పెరిగింది? అనే అంశాలను దర్శకుడు Vijay Adi Reddy చాలా నేచురల్‌గా, ఎమోషనల్‌గా చూపించిన తీరు ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఎక్కడా బలవంతపు డ్రామా లేకుండా, చిన్న చిన్న భావోద్వేగ క్షణాలతో కథను ముందుకు తీసుకెళ్లిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రేమ, బాధ, ఆశ, జీవితం వంటి అంశాలను సింపుల్‌గా చూపించిన తీరు ట్రైలర్‌కు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చింది.

హీరో Surya Vashistta, హీరోయిన్ Deepshika Chandran మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపించింది. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు కథకు మరింత ఎమోషనల్ కనెక్ట్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా సైలెంట్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయినట్టు ట్రైలర్‌లో కనిపిస్తోంది.

'కోర్ట్' ఫేం Ram Jagadeesh అందించిన డైలాగ్స్ ట్రైలర్‌కు మరో బలంగా మారాయి. కొన్ని డైలాగ్స్ నేరుగా హార్ట్‌ను టచ్ చేసేలా ఉండటం విశేషం.

టెక్నికల్‌గా కూడా ట్రైలర్ మంచి ఇంప్రెషన్ ఇచ్చింది. సాఫ్ట్ విజువల్స్‌తో కూడిన కెమెరా వర్క్ కథ మూడ్‌కు తగ్గట్టు కనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. మొత్తం మీద ట్రైలర్ ఒక క్లీన్, హార్ట్‌టచింగ్ ఫీల్‌గుడ్ మూవీని ప్రామిస్ చేస్తోంది.

కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ విడుదల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌లో సినిమాపై మంచి ఆసక్తి కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin