Dailyhunt
రణబాలి నుంచి రష్మిక బర్త్ డే స్పెషల్ వీడియో.. జయమ్మగా అదిరిపోయిన లుక్

రణబాలి నుంచి రష్మిక బర్త్ డే స్పెషల్ వీడియో.. జయమ్మగా అదిరిపోయిన లుక్

TeluguBulletin.com 2 weeks ago

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్ డే సందర్భంగా రణబాలి చిత్ర యూనిట్ ప్రత్యేక వీడియోను విడుదల చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోలో రష్మిక జయమ్మ పాత్రలో ఎంత సహజంగా ఒదిగిపోయిందో చూపిస్తూ, సినిమాలో ఆమె పాత్ర ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు.

వీడియోలో "రణబాలి బలం జయమ్మ.. అతని సంతోషాలకు కారణం జయమ్మ" అని చూపించడం ఈ జంట మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని తెలియజేస్తోంది.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం రణబాలిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ సిరీస్ సమర్పిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఇటీవలే అనంతపూర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ "రణబాలి" అనే యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక "జయమ్మ"గా కీలకమైన, భావోద్వేగపూరిత పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

19వ శతాబ్దం నేపథ్యంతో, 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలన కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ కథలో యాక్షన్, ఎమోషన్, ప్రేమ అన్నీ కలగలిపి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై మంచి హైప్ తీసుకురాగా, ఇప్పుడు రష్మిక బర్త్ డే సందర్భంగా వచ్చిన ఈ స్పెషల్ వీడియో మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా జయమ్మ పాత్రలో రష్మిక చూపిన నేచురల్ పెర్ఫార్మెన్స్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన హైలైట్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రణబాలి సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin