Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

నసేన పార్టీ చేపట్టిన 'ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న ఈ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan పాల్గొని సాధక్‌లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలకు ఈ సమావేశం ద్వారా ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారు. ముఖ్యంగా 300కు పైగా సభ్యత్వాలు నమోదు చేసిన సాధక్‌లను ఎంపిక చేసి సమావేశానికి ఆహ్వానించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే ఉద్యమి సభ్యత్వ నమోదు ప్రక్రియలో పార్లమెంట్ ఇంచార్జులుగా వ్యవహరించిన పార్టీ నాయకులు కూడా పాల్గొననున్నారు. పార్టీ విస్తరణలో క్షేత్ర స్థాయిలో కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ప్రోత్సాహం కలిగించేలా ఈ సమావేశం ఉండనుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

స్థానిక స్థాయిలో పార్టీ బలోపేతానికి ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం మంచి స్పందన తెచ్చిందని, భవిష్యత్ రాజకీయ కార్యాచరణలో ఈ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషించనుందని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin