Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rishab Shetty: 'పెద్ది' ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా..! ఏమన్నారంటే..

Rishab Shetty: 'పెద్ది' ట్రైలర్ కు రిషబ్ శెట్టి ఫిదా..! ఏమన్నారంటే..

Rishab Shetty: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సందడి మొదలైంది. నిన్న విడుదలైన ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ట్రైలర్ కట్ లో రామ్ చరణ్ చూపిన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్, హై ఇన్టెన్సిటీ యాక్షన్, స్పోర్ట్స్ యాంగర్ కి ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు ముగ్దులైపోయారు.

ప్రతి ఫ్రేమ్ లో దర్శకుడిగా బుచ్చిబాబు చూపిన వైవిధ్యనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే కాన్సెప్ట్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. సినిమాలో ఇంకెంత బలమైన కంటెంట్ ఉంటుందోననే చర్చ నడుస్తోంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి సైతం 'పెద్ది' ట్రైలర్ చూసి థ్రిల్ ఫీలయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

'పెద్ది ట్రైలర్ చూశాను. కన్నులపండుగగా ఉంది. ప్రతి ఫ్రేమ్ లో రామ్ చరణ్ కష్టం కనిపించింది. పాత్రోచితంగా ఆయన ఒదిగిపోయిన తీరు అద్భుతం. సినిమా మొత్తం రిచ్ నెస్ కనపడింది. ట్రైలర్ లో శివరాజ్ కుమార్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. పాత్రలో హుందాతనం కనపడింది. జాన్వీ కపూర్ అందం సినిమాకు ఎంతో గ్లామర్ తీసుకొచ్చింది. సినిమాను దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన విధానం, ఆయన కష్టం ట్రైలర్ లో కనిపిస్తోంది. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షల'ని అన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెద్ది సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 3న సాయంత్రం 6గంటలకు, రాత్రి 9గంటలకు రెండు ప్రీమియర్లతో సినిమా సందడి ప్రారంభం కానుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రమోషన్లు వరుసగా జరుగనున్నాయి. ఇందుకు ప్రారంభంగా ముంబయిలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈనెల 23న భోపాల్ ఏ.ఆర్.రెహమాన్ కాన్సెర్ట్ తో భారీ వేడుక నిర్వహించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin