Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సైదాబాద్ బాలిక రేప్ నింధితుడు ఆత్మహత్య

సైదాబాద్ బాలిక రేప్ నింధితుడు ఆత్మహత్య

TeluguBulletin.com 5 years ago

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్‌ బాలిక రేప్‌ మరియు హత్య కేసు నింధితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్రంకు చెందిన వెయ్యి మంది పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

ఎట్టకేలకు అతడిని పోలీసులు రైల్వే ట్రాక్ పై నిర్జీవంగా కనిపెట్టారు. అతడి చేతిపై ఉన్న టాటూ మరియు అతడి జుట్టు ఇతర ఆనవాళ్ల ఆధారంగా అతడు రాజుగా గుర్తించడం జరిగింది.

ఈనెల 9న ఆరేళ్ల బాలికపై అతడు అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఆ సంఘటన తర్వాత నింధితుడు కనిపించకుండా పోయాడు. అతడి రూమ్‌ తలుపులు బద్దలు కొట్టి చూడగా అక్కడ బాలిక మృతదేహం కనిపించింది. రాజు ఆచూకి తెలిపిన వారికి పది లక్షల రివార్డును ప్రకటించడం జరిగింది. ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు ఇలా అనేక మందిని ఎంక్వౌరీ చేశారు. చివరకు అతడి మృతదేహం ఘట్కేసర్‌ వద్ద లభ్యం అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు. రాజు మృతి చెందిన విషయం తెలియడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin