ఆయాతి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఇండిపెండెంట్ ఫోక్ సాంగ్ "నువ్వు రమ్మంటే" ఘనంగా విడుదలైంది. ఢీ అభి, నైనిక అనసూరు, 'రాను బొంబాయికి రాను' ఫేమ్ లిఖిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం విశేషం.
ప్రముఖ నిర్మాత సంధ్యా శ్రీధర్ కంతేటి నిర్మించిన ఈ సాంగ్‌కు కుమార్ జి. దర్శకత్వం వహించగా, కల్యాణ్ కీస్ సంగీతం సమకూర్చారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన సాంగ్ లాంచ్ కార్యక్రమానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ భాను మాస్టర్, గాయకుడు రామ్ రాథోడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
రామ్ రాథోడ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి అతిథిగా రావడం ఆనందంగా ఉందన్నారు. గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్లతో ఒకే వేదికను పంచుకోవడం గర్వంగా ఉందని చెప్పారు. రాహుల్ సిప్లిగంజ్ స్ఫూర్తితోనే తాను ఫోక్ పాటలు పాడటం ప్రారంభించానని, "నువ్వు రమ్మంటే" పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

నిర్మాత సంధ్యా శ్రీధర్ కంతేటి మాట్లాడుతూ, తాను పవన్ కల్యాణ్ అభిమానినని, ఆయన సినిమాల్లో ఉండే ఫోక్ పాటలు తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అలాంటి ఓ ఫోక్ సాంగ్ నిర్మించాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని చెప్పారు. గణేష్ మాస్టర్, లిఖిత సహకారంతో ఈ పాట అద్భుతంగా రూపుదిద్దుకుందని, ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
నటి లిఖిత మాట్లాడుతూ, గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఈ పాటకు అంగీకరించానన్నారు. ప్రేక్షకులంతా ఈ పాటను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.
హీరో ఢీ అభి మాట్లాడుతూ, ఇది తన తొలి ఫోక్ సాంగ్ అని తెలిపారు. శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ వంటి ప్రముఖులు తన సాంగ్ లాంచ్‌కు రావడం ఆనందంగా ఉందన్నారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో పనిచేయడం తన అదృష్టమని, ఈ పాట తన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు.
రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండిపెండెంట్ మ్యూజిక్కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. "నువ్వు రమ్మంటే" మంచి పాటగా నిలుస్తుందని, కల్యాణ్ కీస్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని ప్రశంసించారు. ఈ కాన్సెప్ట్‌కు గణేష్ మాస్టర్‌కు పూర్తి క్రెడిట్ దక్కాలని పేర్కొన్నారు.
భాను మాస్టర్ మాట్లాడుతూ, తన గురువు గణేష్ మాస్టర్ ఆహ్వానంతో ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. స్టార్ హీరోల సినిమాలతో పాటు కొత్త టీమ్‌తో ఫోక్ సాంగ్ చేయడం గణేష్ మాస్టర్ కళపై ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పారు. ఈ పాట మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, "నువ్వు రమ్మంటే" పాట చాలా బాగా వచ్చిందని అన్నారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రియేటివిటీ కనిపిస్తుందని, ఈ పాటలో కూడా అద్భుతమైన స్టెప్స్ రూపొందించారని ప్రశంసించారు. ఈ పాటలోని కాన్సెప్ట్ కొత్తగా ఉందని, ఒక కమర్షియల్ సినిమాలో ఉంటే కోట్ల రూపాయల విలువైన పాటగా నిలిచేదని అన్నారు. హీరో అభికి ఈ పాటతో మంచి గుర్తింపు రావాలని, లిఖితతో పాటు మొత్తం చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
గణేష్ మాస్టర్ మాట్లాడుతూ, శేఖర్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ వంటి సన్నిహితులు ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత సంధ్యా శ్రీధర్ కంతేటి అందించిన సహకారం వల్లే ఈ పాటను అనుకున్న స్థాయిలో రూపొందించగలిగామని చెప్పారు. కల్యాణ్ కీస్ మంచి సంగీతం అందించారని, హీరో అభి ఎంతో కష్టపడి ఈ పాట చేశారని తెలిపారు. లిఖిత వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించడం ఆనందంగా ఉందని, ఈ పాట ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

