Dailyhunt
తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు..! హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు..! హైదరాబాద్ లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

TeluguBulletin.com 4 years ago

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ లో మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణాలను వేగంగా చేసట్టాలని నిర్ణయించింది.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానంగా రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై మంత్రివర్గం చర్చించింది. ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

  • రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.56 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది. నేటి నుంచి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహణ
  • గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం ఉంటే.. ప్రస్తుతం 280 మెట్రిక్ టన్నులకు పెంపు. 550 మెట్రిక్ టన్నుల సామర్ధ్యానికి పెంచుకునేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
  • ప్రస్తుతం రాష్ట్రంలో 133 కోట్లతో పడకలు, మందులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంది.

చిన్న పిల్లల వైద్యానికి ఏర్పాట్లలో భాగంగా 5200 పడకలు సమకూర్చుకున్నామని వెల్లడి.

  • రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని.. పాఠశాలలు తెరిచినా కోవిడ్ కేసులు లేవని.. చిన్న పిల్లలకు కోవిడ్ సోకితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి.

క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు..

  • పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. మంత్రి సత్యవతి రాథోడ్ చైర్ పర్సన్ గా.. మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఏర్పాటు.
  • కొత్త జిల్లాల్లో పోలిస్ స్టేషన్ల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీ చైర్మన్ గా.. మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి సభ్యులుగా కమిటీ ఏర్పాటు.
  • ఈనెల 24 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహణ. ఈమేరకు క్యాబినెట్ ఆమోదం.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin