Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tharun Bhascker-Eesha Rebba: పండుగ రోజున 'ఇద్దరూ' పంచుకున్న ఫొటో..! అర్ధమేంటో..!?

Tharun Bhascker-Eesha Rebba: పండుగ రోజున 'ఇద్దరూ' పంచుకున్న ఫొటో..! అర్ధమేంటో..!?

Tharun Bhascker-Eesha Rebba: సెలబ్రిటీల నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా ప్రేక్షకులకు, సినీ అభిమానులకు సందడే. ఎవరైనా కలిసి ఫోటో దిగినా.. కలిసి వెకేషన్ కు వెళ్లినా..

వరుసగా సినిమాలు చేసినా.. స్నేహితులమని పిక్స్ షేర్ చేసినా ఆసక్తి రేకెత్తిస్తూనే ఉంటుంది. ఇప్పుడలాంటి ఓ ఆసక్తికరమైన ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వినాయకచవితి పండుగనాడు ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీలు షేర్ చేసిన ఫొటో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. వారిద్దరే దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బ. పండుగనాడు తరుణ్ భాస్కర్ నటి ఈషా రెబ్బతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. వీరిద్దరి స్నేహం గురించి టాలీవుడ్ లో ఇప్పటికే అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలతో హోరెత్తిస్తున్నారు. అయితే.. వీరిద్దరి గురించి ఎలాంటి గాసిప్ వచ్చినా వీరిద్దరూ ఏనాడూ స్పందించలేదు. ఇప్పుడు వినాయకచవితినాడు తొలిసారిగా వీరిరువురూ కలిసి ఫొటో షేర్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుంది. అయితే.. ఎటువంటి ఆసక్తికరమైన విషయాన్ని వీరిద్దరూ పంచుకోలేదు. అయితే.. సినీ సెలబ్రిటీలు మాత్రం వీరిద్దరి గురించి కామెంట్స్ చేయడం విశేషం.

నటి మంచు లక్ష్మి, శృతి హాసన్, శివాత్మిక, నివేదిత పేతురాజ్, కావ్య కల్యాణ్ రామ్.. తదితరులు వీరి ఫొటోకి లైక్ చేశారు. లక్ష్మి మంచు.. ఈ ఫొటో చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. కావ్య కల్యాణ్ రామ్.. వినాయకచవితి నాడు మంచి పులిహోర తిన్న్ ఫీలింగ్ ఉందీ పొటోలో అని కామెంట్స్ చేశారు. ఇప్పుడీ ఫొటో సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నెటిజన్లైతే ఆల్ ది బెస్ట్ కూడా చెప్పేస్తున్నారు. మరోవైపు.. వినాయకచవితికి మట్టి వినాయకుడిని తరుణ్ భాస్కర్ స్వయంగా తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin