Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

టీవీకే విజయ్‌కి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది.!

TeluguBulletin.com 2 weeks ago

మొత్తం 234 అసెంబ్లీ సీట్లలో టీవీకే విజయ్ గెలుచుకున్నది 108 నియోజకవర్గాల్లో. ఆషామాషీ విజయం కాదిది. అత్యద్భుత విజయం. కానీ, రాజకీయాల్లో ఈ అద్భుత విజయం, ఎంతవరకు టీవీకే విజయ్‌కి ఉపయోగపడుతుంది.?

అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
అదేంటీ, విజయ్ ముఖ్యమంత్రి అయిపోతారు కదా.? అంటే, అయ్యేందుకు అవకాశం వుందంతే. పైగా, ఆయనకిప్పుడు ఎవరో ఒకరి మద్దతు కావాలి. ఒక్కరి మద్దతు సరిపోతుందా.? కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆయనకు మద్దతివ్వాలా.? చాలా ఈక్వేషన్స్ దాగున్నాయి, విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే.

118 సీట్లు సాధించి వుంటే, విజయ్ ఎవరి సపోర్ట్ లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేవారు. కానీ, విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే తక్కువలో తక్కువ పది మంది ఎమ్మెల్యేల బలం అదనంగా కావాల్సి వుంటుంది. అది బొటాబొటి మెజార్టీ అవుతుంది.
సో, ఇంకో ఆలోచన లేకుండా ఏఐఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవడం విజయ్‌కి శ్రేయస్కరం. కానీ, తమిళనాడు రాజకీయాలు చాలా చాలా ప్రత్యేకం. ఏమో, డీఎంకే పార్టీనే ఓ అడుగు ముందుకేసి విజయ్‌కి బేషరతు మద్దతు ప్రకటిస్తుందా.? ప్చ్ ఔననీ, కాదనీ చెప్పలేం.

పెద్ద సంకటమే ఎదురుకానుందిప్పుడు టీవీకే విజయ్‌కి. ఎవరో ఒకరు మద్దతు ప్రకటిస్తారు, విజయ్ గట్టెక్కేస్తారు. కానీ, ముఖ్యమంత్రిగా తనదైన పాలన అందించాలంటే మాత్రం, అడుగడుగునా మిత్రపక్షానికి తలొగ్గి పని చేయాల్సిందే. అదే అసలు సిసలు అగ్ని పరీక్ష టీవీకే విజయ్‌కి.
ఎప్పుడు తమ ప్రభుత్వం కూలిపోతుందో తెలియని అయోమయంలో దినదినగండం నూరేళ్ళు ఆయుష్షు.. అన్న చందాన టీవీకే విజయ్ రాజకీయ భవితవ్యం వుండబోతోందన్నది నిర్వివాదాంశం. మరి, ఇలాంటి పరిస్థితుల్లో టీవీకే విజయ్ తీసుకోబోయే భవిష్యత్ కార్యాచరణ ఎలా వుండబోతోంది.?
అన్నట్టు, విజయ్‌కి వెంటనే ఇంకో అగ్ని పరీక్ష వుంది. పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలిచిన విజయ్, ఓ స్థానానికి రాజీనామా చేయాలి. ఆ స్థానం నుంచి తమ పార్టీ నుంచి ఎవరో ఒకర్ని నిలబెట్టి, గెలిపించుకోవాలి. అయితే, దానికి కాస్త సమయం వుంది లెండి.!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin