Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood-Sankranthi-2027: సంక్రాంతి-2027 సినిమాలు రెడీ..! ఈసారి హెవీ రష్..

Tollywood-Sankranthi-2027: సంక్రాంతి-2027 సినిమాలు రెడీ..! ఈసారి హెవీ రష్..

TeluguBulletin.com 3 weeks ago

Tollywood-Sankranthi-2027: ఈమధ్య టాలీవుడ్ లో వచ్చిన కొత్త ట్రెండ్.. వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే సినిమాలను ఈ సంక్రాంతి పండగ తర్వాతి నెల ఫిబ్రవరి నుంచే ప్రకటించడం, మరికొన్ని సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుని ఆగష్టులోపు ప్రకటించేస్తారు.

కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ పెద్దది కావడం, కుటుంబాలు కలవడంతో పండగను సంబరంలా ప్రతి ఇంటా జరుపుకుంటారు. ఈక్రమంలో ప్రజల మనసుల్లో మొదిలే మొదటి ఆలోచన సినిమా. అందుకే మేకర్స్ కూడా సంక్రాంతి బాగా టార్గెట్ చేసుకుంటారు. ఈక్రమంలో 2027 సంక్రాంతి సీజన్ భారీగా నిండిపోయింది.

వెంకటేశ్-కల్యాణ్ రామ్ కాంబినేషన్లో మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'జనవరి 12 విడుదల' తొలుత ప్రకటించిన సినిమా. అదే తేదీన రాబోతున్నారు. అనిల్-సంక్రాంతి సెంటిమెంట్ తో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. దీని తర్వాత సంక్రాంతికి ప్రకటించిన సినిమా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కాకా'. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబి కాంబినేషన్లో వస్తున్న సినిమా.. సంక్రాంతి చిరంజీవి కలిసివస్తూండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటివల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ తో అంచనాలు మరింత పెరిగాయి.

మెగా ఫ్యామిలీ హీరో సాయిదుర్గాతేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ 'సంబరాల ఏటిగట్టు' జనవరి 12న విడుదలవుతోంది. రోహిత్.కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిరియాడిక్ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో విజయం అందుకున్న శర్వానంద్ కూడా సంక్రాంతి సిద్ధమవుతున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో నటిస్తున్న 'జార్జ్ క్రిష్'ను జనవరి 14 విడుదల చేయనున్నారు. 2024 సంక్రాంతికి 'హను-మాన్'తో హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ కథతో తెరెకెక్కుతున్న 'మహాకాళి' జనవరి 8న రానుంది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకురాలు.

కింగ్ నాగార్జున కూడా సంక్రాంతికి రాబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తన 100వ సినిమాను పండక్కే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇటివల 'ఇరుముడి'తో భారీ హిట్ అందుకున్న రవితేజ, కామెడీ సినిమాలతో అలరిస్తున్న శ్రీవిష్ణు మల్టీస్టారర్ మూవీ 'వీరాధివీరులు' సంక్రాంతికే వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ప్రతి సంక్రాంతికి తెలుగులో ఓ డబ్బింగ్ సినిమా ఉన్నట్టే ఈసారి తమిళ అగ్రహీరో రజినీకాంత్ హీరోగా వస్తున్న 'ధర్మన్'కూడా సంక్రాంతికే రానుందని తెలుస్తోంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో అగ్రనటుడు కమల్ హాసన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.

మొత్తంగా రాబోయే సంక్రాంతికి ధియేటర్ల దగ్గర భారీ రష్ ఉండబోతోంది. ధయేటర్స్ క్లాష్ మరీ ఎక్కువగా ఉండబోతోంది. ప్రతి సంక్రాంతికి 4సినిమాలు సందడి చేసేవి ఈసారి 6సినిమాలు ముస్తాబవుతున్నాయి. నాగార్జున, రవితేజ-శ్రీవిష్ణు తప్పితే అందరూ డేట్స్ అనౌన్స్ చేసినవారే. మరి.. వీటిలో ఏదైనా పోస్ట్ పోన్ అవుతుందా.. అందరూ వచ్చేస్తారా.. చూడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin