Dailyhunt
Trisha: 'ప్రేమ'పై త్రిష కామెంట్.. హాట్ టాపిక్ గా మారిన పోస్ట్

Trisha: 'ప్రేమ'పై త్రిష కామెంట్.. హాట్ టాపిక్ గా మారిన పోస్ట్

TeluguBulletin.com 3 weeks ago

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్ గా దశాబ్దాలుగా కొనసాగుతున్నారు త్రిష. తెలుగు, తమిళంలో కొన్నాళ్లు నెంబర్ వన్ గానూ కొనసాగారు. అయితే, సినిమాలకు అతీతంగా ఆమె చుట్టూ అనేక వివాదాలూ ఉంటూనే ఉంటాయి.

రీసెంట్ గా తమిళ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ తో ఆమె ఓ వేడుకకు హాజరు కావడం దక్షిణాదిన తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎన్నో రూమర్లు సైతం సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొట్టాయి. ఈక్రమంలో ఆమె దేనికీ స్పందించలేదు. కానీ.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ వార్తల్లో నిలుస్తోంది. ప్రేమకు సంబంధించిన ఓ కోటేషన్ ను త్రిష పోస్టు చేశారు. 'ప్రతిదీ ప్రేమ కాదు. కానీ, ప్రేమ లేకపోతే దేనికీ అర్థం లేదు' అని అర్ధం వచ్చేలా 'ఫ్యాక్ట్' (వాస్తవం) అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఈ పోస్ట్ అయ్యుంటుదనే కామెంట్స్ కూడా రౌండ్ అవుతున్నాయి.

రాజకీయాలకు సంబంధం లేకున్నా ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో ఆమె పేరు వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర', తమిళంలో సూర్యతో ఓ సినిమా, మలయాళంలో మోహన్ లాల్ తో 'రామ్'లో నటిస్తున్నారు. కెరీర్ మొదలుపెట్టి 23ఏళ్లు దాటినా ఇంకా హీరోయిన్ గా బిజీగా ఉండటం విశేషం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin