Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైఎస్ జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా?

వైఎస్ జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారా?

TeluguBulletin.com 2 weeks ago

ఎంత గొప్ప పాలన అందించినా, ప్రభుత్వ వ్యతిరేకత అన్నది అధికారంలో వున్న పార్టీలకు ఖచ్చితంగా వుండి తీరుతుంది ప్రజల నుంచి.! ఇది అందరికీ తెలిసిన విషయమే.

మరి, ఆ ప్రజా వ్యతిరేకతను వైసీపీ ఎంతవరకు రాజకీయంగా క్యాష్ చేసుకోగలుగుతోంది.? అంటే, అదొక మిలియన్ డాలర్ క్వశ్చన్.

వైఎస్సార్ కాంగ్రస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గత కొంత కాలంగా బెంగళూరుకే పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడూ వస్తున్నారు, వచ్చి 'కామెడీ' చేసి వెళ్ళిపోతున్నారు. వైఎస్ జగన్ పెట్టే ప్రెస్ మీట్స్ వైసీపీకి రాజకీయంగా ఉపయోగపడటం లేదు సరికదా, కామెడీ అయిపోతున్నాయి అని పార్టీ నాయకులే ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్, 'ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు..' అంటూ పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రిగా వున్న సమయంలో మాత్రం, ఏకగ్రీవాలకు ప్రభుత్వం తరఫున నజరానాలు ప్రకటించేశారు ఇదే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

వైఎస్ జగన్ దిశా నిర్దేశం సంగతెలా వున్నా, రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, స్థానిక ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలా వైసీపీ క్యాడర్ బలంగా నిలబడిన చోట్ల కొన్ని కంటి తుడుపు విజయాలూ వైసీపీకి దక్కాయి. అయితే, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బలంగా నిలబడినా, పులివెందులలో వైఎస్ జగన్ చేతులెత్తేయడం అందర్నీ విస్మయానికి గురిచేసింది.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా పులివెందులలో గనుక వైఎస్ జగన్ మకాం వేసి వుంటే, ఖచ్చితంగా వైసీపీకి అడ్వాంటేజ్ అయి వుండేది. జగన్, జనాల్లోకి వెళ్ళకపోయినా, పార్టీ ముఖ్య నేతలకు ఆయన అందుబాటులో వుండాల్సింది. ఇదీ, వైసీపీ కడప జిల్లా నాయకుల మనోగతం.

తన ఓటు తాను వేసుకోవడానికి కూడా వైఎస్ జగన్ ఆసక్తి చూపలేదన్న చర్చ, పులివెందుల ఓటర్లలోనూ జరిగింది. నిజానికి, గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో. టీడీపీ - బీజేపీ - జనసేన క్యాడర్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వున్న చోట్ల, వైసీపీ బలంగా నిలబడి వుంటే, ఈక్వేషన్ ఇంకోలా వుండి వుండేది.

అసలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదేమో.. అన్న అభిప్రాయాలు వైసీపీ నాయకుల్లోనే వ్యక్తమవుతున్నాయంటే, పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin