Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీలో 'విజయసాయి రెడ్డి' కుదుపు.! తన్నులు తిన్నవాళ్ళు ఇంకెందరో.?

వైసీపీలో 'విజయసాయి రెడ్డి' కుదుపు.! తన్నులు తిన్నవాళ్ళు ఇంకెందరో.?

TeluguBulletin.com 3 weeks ago

రాజ్యసభ సభ్యుడిని కొట్టడమేంటి.? పైగా, విజయ సాయి రెడ్డి లాంటి కీలక నేత మీద చెయ్యి చేసుకోవడమా.? ఇప్పుడిది వైసీపీలో అంతర్గతంగా పెను ప్రకంపనలకు తావిస్తున్న అంశం.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షిగా దాడి జరిగిందట.. అని వైసీపీలోనే కింది స్థాయి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

వైసీపీని విజయ సాయి రెడ్డి వీడి చాన్నాళ్ళే అయ్యింది. ప్రస్తుతం వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి హవా కొనసాగుతోంది. వైసీపీలో ఆయనే నెంబర్ వన్.. అని తాజాగా విజయ సాయి రెడ్డి సంధించిన లేఖాస్త్రం, వైసీపీలో పెను దుమారానికి కారణమవుతోంది.

వైసీపీలో సజ్జల బాధితులు ఒకరొకరుగా తెరపైకొస్తున్నారు. 'అది నిజమే.. అధినేత వద్దకు సామాన్య కార్యకర్తే కాదు.. కీలక నేతలూ వెళ్ళలేకపోతున్నారంటే, దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనమే..' అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీకి చెందిన పలువురు తమ అభిప్రాయాల్ని, అనుభవాల్నీ కుండబద్దలుగొట్టేస్తున్నారు.

సరే పార్టీ వీడిన నాయకులు, ఆయా పార్టీలపై ఈ తరహా ఆరోపణలు చేయడం వింతేమీ కాదు. కాకపోతే, సజ్జల రామకృష్ణా రెడ్డి అంటే, వైఎస్ జగన్ వారం వారం ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడాలో కూడా దిశానిర్దేశం చేసే నేత.. అన్నది వైసీపీలో అందరికీ తెలిసిన విషయమే.

మాజీ మంత్రులూ గత కొంతకాలంగా సజ్జల తీరుపై గుస్సా అవుతున్నారు. వైసీపీ హయాంలో, ఏదన్నా ఘటన జరిగితే సంబంధిత మంత్రి కన్నా ముందు సజ్జల రామకృష్ణా రెడ్డి హడావిడి చేసేవారు. ఇదంతా ఆయా నేతలు గుర్తు చేసుకుంటున్నారు.

వున్నపళంగా సజ్జలను పీకేస్తే తప్ప వైసీపీ బాగుపడదన్న అభిప్రాయం వైసీపీలో చాలామందికి వుంది. కానీ, జగన్ అలాంటి రిస్క్ తీసుకోలేరన్నది మెజార్టీ అభిప్రాయం. సజ్జల రామకృష్ణా రెడ్డి దగ్గర పరపతి కోసం అప్పట్లో ఇద్దరు మహిళా జర్నలిస్టులు రచ్చకెక్కి కొట్టుకున్న సంగతి తెలిసిందే.

సజ్జల ప్రేరణతో, వైసీపీలో చాలామంది నేతలు భౌతిక దాడులు చేసుకున్నారు.. జర్నలిస్టులెంత.? అని అప్పట్లోనే చాలామంది చర్చించుకున్నారు. తన్నుకున్నవాళ్ళు, తన్నులు తిన్నవాళ్ళు, తన్నినవాళ్ళు.. ముందు ముందు మరిన్ని వివరాలతో విజయ సాయి రెడ్డిలానే ముందుకొస్తారేమో.!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin