రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ప్రజాప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, హస్త కళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి దేవాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ తదితరులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం తెలిపారు.


విమానాశ్రయం నుంచి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లికి బయలుదేరారు. అక్కడ కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి VB-G RAM G జాతీయ స్థాయి అమలు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానుండగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాలకు సంబంధించిన కీలక కార్యక్రమంగా ఇది నిలవనుంది.


