Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది.

ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి జనసేన పార్టీ కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధిపతుల పవిత్ర కరకమలాలతో యంత్రస్థాపన నిర్వహించి, శ్రీ విశ్వనాథ స్వామి వారి శివాలయ పునః ప్రతిష్ట మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు ప్రేమ్ కుమార్‌కు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మహోత్సవంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, పోలేబోయిన శ్రీనివాస్, పాదం సూర్యతో పాటు మహిళలు, యువకులు , పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సమక్షంలో నిర్వహించిన పునః ప్రతిష్ట మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Bulletin