ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి ప్రధాని జార్జియా మెలోనితో కలసి చేసిన ఒక సరదా క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అధికారిక సమావేశాలకు ముందు మోదీ, మెలోనికి ప్రముఖ 'మెలోడీ' చాక్లెట్ల ప్యాక్‌ను అందజేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. నెటిజన్లు చాలాకాలంగా వీరిద్దరినీ "#Melodi" అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుండగా, అదే పేరును గుర్తు చేసేలా మోదీ ఈ గిఫ్ట్ ఇవ్వడం ఆసక్తి రేపింది.
రోమ్‌లో జరిగిన ఈ భేటీలో ఇద్దరు నాయకులు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. మోదీ అందించిన చాక్లెట్లను స్వీకరించిన మెలోని చిరునవ్వుతో స్పందించగా, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో షేర్ చేసిన మెలోని, బహుమతికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఇటలీ పర్యటనలో భాగంగా మోదీ, మెలోని కలిసి రోమ్‌లోని చారిత్రాత్మక కొలోసియంను సందర్శించారు. అనంతరం వాణిజ్యం, రక్షణ, కనెక్టివిటీ, టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో భారత్-ఇటలీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. అధికారిక చర్చలకంటే ముందు చోటుచేసుకున్న ఈ చిన్న సంఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరోసారి హైలైట్ చేసింది.

