Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రా? హై బీపీ ప్రమాదం పెరుగుతుందట!

రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రా? హై బీపీ ప్రమాదం పెరుగుతుందట!

నిషి ఆరో్యంగా ఉండటంలో ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో.. మంచి నిద్ర కూడా అంతే కీలకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, మొబైల్ వినియోగం కారణంగా చాలా మంది సరైన నిద్రకు దూరమవుతున్నారు.

రోజుకు ఆరు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం వల్ల హై బీపీ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారతదేశంలో ఇప్పటికే కోట్లాది మంది హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నారని ఆరోగ్య సంస్థల అంచనా. వీరిలో చాలామందికి తమకు బీపీ సమస్య ఉందనే విషయం కూడా తెలియదని వైద్యులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తోందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.

సాధారణంగా మనిషి నిద్రలో ఉన్నప్పుడు గుండె స్పందన రేటు, రక్తపోటు కొంత వరకు తగ్గుతాయి. ఈ సమయంలో గుండె, రక్తనాళాలకు విశ్రాంతి లభిస్తుంది. కానీ తగినంత నిద్ర లేకపోతే శరీరం పూర్తిగా రికవరీ కావడం కష్టమవుతుంది. దీని ప్రభావం నేరుగా గుండె ఆరో్యంపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో హై బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. దీంతో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తనాళాలు కుంచించుకుపోవడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. దీర్ఘకాలంలో ఇవి రక్తపోటు సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

నిద్ర సరిగా లేకపోతే కేవలం బీపీ మాత్రమే కాదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అలసట, మానసిక ఒత్తిడి, జీర్ణ సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, మధ్యలో తరచూ మేల్కొనడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు.

హైపర్‌టెన్షన్‌ను నియంత్రించాలంటే మందులతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా తప్పనిసరి అంటున్నారు వైద్యులు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి అవసరమని చెబుతున్నారు.

నిద్రకు ముందు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఎక్కువసేపు వాడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో టీ, కాఫీ వంటి కెఫిన్ పానీయాలు తగ్గించడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం కూడా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లు పాటించడం ద్వారా హై బీపీతో పాటు అనేక గుండె సంబంధిత సమస్యలను దూరం పెట్టవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Desk