Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉదయాన్నే ఈ మజ్జిగ డ్రింక్ తాగితే బీపీ, షుగర్‌కు డబుల్ బెనిఫిట్!

ఉదయాన్నే ఈ మజ్జిగ డ్రింక్ తాగితే బీపీ, షుగర్‌కు డబుల్ బెనిఫిట్!

ధుమేహం సమస్య ఇప్పుడు చాలా కుటుంబాల్లో సాధారణంగా కనిపిస్తోంది. మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు.

అయితే మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మన ఇళ్లలో సులభంగా లభించే మజ్జిగ కూడా మంచి సహాయక పానీయంగా పనిచేస్తుందని వారు సూచిస్తున్నారు.

మజ్జిగలో సహజ ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో మజ్జిగ తీసుకోవడం వల్ల అలసట, డీహైడ్రేషన్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా ఇది అనుకూలమైన పానీయంగా భావిస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం, మజ్జిగలో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా కొంతవరకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

ప్రతిరోజూ ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక గ్లాసు తాజా మజ్జిగలో అర టీస్పూన్ జీలకర్ర పొడి కలిపి తాగితే జీర్ణవ్యవస్థ చురుకుగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చని చెబుతున్నారు.

మజ్జిగలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఎముకలు బలంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. మధుమేహం ఉన్నవారిలో గాయాలు ఆలస్యంగా మానడం సాధారణ సమస్య. మజ్జిగలో ఉండే కొన్ని పోషకాలు శరీర కణాల పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు.

అయితే మజ్జిగ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అధిక ఉప్పు లేదా ఎక్కువ మసాలాలు కలపకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్యాకెట్ మజ్జిగ కంటే ఇంట్లో తయారుచేసిన తాజా మజ్జిగ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మధుమేహం తీవ్రత వ్యక్తిని బట్టి మారుతుండటంతో కొత్త ఆహార పద్ధతులు ప్రారంభించే ముందు వైద్యులను సంప్రదించడం అవసరమని సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Desk