Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైరల్ అవుతున్న ఉపేంద్ర కుటుంబ వేడుక.. కాబోయే కోడలు ఎవరో తెలుసా?

వైరల్ అవుతున్న ఉపేంద్ర కుటుంబ వేడుక.. కాబోయే కోడలు ఎవరో తెలుసా?

న్నడ స్టార్ హీరో ఉపేంద్ర కుటుంబంలో తాజాగా శుభకార్యం సందడి చేసింది. ఉపేంద్ర సోదరుడి కుమారుడు, యువ నటుడు నిరంజన్ సుధీంద్ర నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

డాక్టర్ సంజనా రాణితో ఆయన ఉంగరాలు మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నిరంజన్ ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 'సెకండాఫ్' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, తర్వాత వచ్చిన కొన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చిన నిరంజన్, యువతలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాల్లో అతని నటనకు మంచి స్పందన లభించింది.

ఇక నిరంజన్‌కు కాబోయే భార్య సంజనా రాణి వైద్య రంగానికి చెందినవారని సమాచారం. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి పెళ్లి వేడుక కూడా జరగనుందని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. నిశ్చితార్థ వేడుకకు ఉపేంద్ర తన సతీమణి ప్రియాంకతో కలిసి హాజరై సందడి చేశారు. వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.

ఉపేంద్ర సినిమాల విషయానికి వస్తే, హీరోగా మాత్రమే కాకుండా విభిన్న పాత్రలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి స్టార్ కుటుంబంలో జరిగిన ఈ వేడుక ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Desk