Thursday, 17 Dec, 12.59 pm TeluguLives.com

హోమ్
చీరాల మత్స్యకారుల ఎమోషన్‌తో పొలిటికల్ రౌడీల ఆటలు.!

ఎక్కడ వివాదం ఉంటే.. అక్కడ నేనుంటా అనే వికృత రాజకీయాలు చేస్తున్న ప్రకాశం జిల్లా పొలిటికల్ రౌడీలను ప్రజలు ఛీ కొడుతున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో విసిగిపోయి ఉన్న ఈ సీనియర్ నేత రాజకీయ అంకానికి తెరదించుతామని కూడా చీరాల ప్రజానీకం గళమొత్తుతోంది. చీరాలలో ఇటీవ ల మత్స్యకార వివాదం తలెత్తింది. ఇక్కడ సీనియర్ నాయకుడుగా ఉన్న సదరు ఫ్యాక్షన్ నేత (స్థానికులు ఇలానే పిలుస్తారట, మరో ముద్దుపేరు అద్దంకి రౌడీ) వేలు పెట్టాడు. అంతే! అప్పటి వరకు అంతో ఇంతో.. సర్దుమణుగుతుందిలే.. అని భావించిన వారికి.. సదరు నేత ప్రవేశంతో.. ఆ ఘర్షణ కాస్తా.. మరింత పెరిగిపోవడంతో గుండెలు బాదుకున్నారు. ఇలాంటి ఫ్యాక్షనిస్టుగా మేం ఓటేసింది! అని తలపట్టుకున్నారు.

ఎక్కడైనా.. ఏ సామాజిక వర్గంలో అయినా.. వివాదాలు కామనే. ఇక, ఒకే వృత్తిలో ఉన్న రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తితే దానిని పరిష్కరించేందుకు ఒకింత చాతుర్యం అవసరం. ఓర్పు, సంయమనంతో వ్యవహరించాలి. ఇరుపక్షాల సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. కానీ.. ఇక్కడ సదరు ఫ్యాక్షన్ నేత మాత్రం దీనిని రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించి.. ఇరు పక్షాల మత్య్స కారుల వివాదంతో చలికాచుకున్నాడని అంటున్నారు స్థానికులు. అసలు ఏం జరిగిందంటే.. వేటకు ఉపయోగించే వల విషయంలో వాడరేవు, కఠారివారిపాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య గతనెలలో వివాదం తలెత్తింది. అది చినికిచినికి గాలివానగా మారి ఒకరి బోట్లను మరొకరు తమ ఆధీనంలోకి తీసుకునే వరకు వెళ్లింది.

అంతకుముందే వేట విషయంలో ఏ వల వాడాలనేదానిపై ఈ రెండు వర్గాల మధ్య పంచాయితీలు జరిగాయి.. కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నారు. వీటిని ఓ వర్గం మత్స్యకారులు ఉల్లంఘించారన్న ఆరోపణలతోనే అసలు గొడవ ప్రారంభమైంది. మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి ఇప్పటికే అధికారుల స్థాయిలో పంచాయితీ నిర్వహించారు. కానీ, సమస్యకు పరిష్కారం లభించలేదు. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి వీరి మధ్య గొడవ సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం ఫలించిందా లేదా.. అనేది పక్కన పెడితే.. ఆమంచి ప్రయత్నం సానుకూలంగా జరిగింది.

అంతేకాదు.. మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణను సైతం రంగంలోకి దింపి.. ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఆవేదనకు గురైన ఆమంచి ఇలా వ్యవహిస్తే.. ఇక్కడ.. ఎప్పుడు ఘర్షణలు వచ్చినా.. తనకు అనుకూలంగా మార్చుకుని.. వాటిని పెంచి పోషించిన నాయకుడిగా.. పేరున్న అద్దంకి రౌడీ (స్థానికుల నిక్ నేమ్‌) ఇప్పుడు దీనికి కూడా తన మార్కు రాజకీయం అద్దేశాడు. దీంతో ఆయన, ఆయన కుమారుడు .. పెయిడ్ బ్యాచ్‌ను దింపేసి.. మత్స్య కారుల మధ్య ఉన్న భావోద్వేగాన్ని మరింత రెచ్చగొట్టి.. ఆమంచిపై రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. చివరకు మత్స్యకారులు కోట్లాటలో ఉంటే ఆ రౌడీ బ్యాచ్ వికృతానందంతో పొలిటికల్ పైశాచికానందం పొందుతోన్న పరిస్థితి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Lives Telugu
Top