Friday, 14 Aug, 3.10 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
ఈ నెల 19న ఏపీ కేబినేట్ భేటీ

ఈ నెల 19న ఏపీ కేబినేట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. గత రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయ్. రాష్ట్రంలో కరోనా ఉదృతి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది.

ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై చర్చించనున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై కూడా చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై కమిటీ వేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. రాజధాని వికేంద్రీకరణకు ఎదురవుతున్న న్యాయపరమైన చిక్కులపై చర్చించనున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top