Thursday, 28 Jan, 8.14 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
గంగూలీకి మమత పరామర్శ

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(48) మరోసారి హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం నుంచి ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో బుధవారం మధ్యాహ్నం కోల్‌కతాలోని అపోలో హాస్పిటల్‌లో చేరారు.

ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపోలో ఆస్పత్రిలో గంగూలీని పరామర్శించారు. దాదా ఆరోగ్య పరిస్థితి, తదుపరి చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మమతతో గంగూలీకి మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఇటీవల కాలంలో గంగూలీ భాజాపాకి దగ్గరయ్యారు. ఆయన త్వరలోనే భాజాపాలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top