Friday, 14 Aug, 7.13 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమిత్ షా ట్విట్ చేశారు. తనకు ఈరోజు నిర్వహించిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈశ్వరుడి దయ వల్ల కరోనా నుంచి బయటపడ్డానని చెప్పారు.

కరోనా నుంచి తాను కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెపుతున్నానని తెలిపారు. వైద్యుల సలహా మేరకు మరి కొన్ని రోజులు హోం ఐసొలేషన్ లో ఉంటానని చెప్పారు. తనకు చికిత్స అందించిన మేదాంత ఆసుపత్రి డాక్టర్లకు, ప్యారా మెడికల్ సిబ్బందికి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top