Friday, 14 Aug, 3.10 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
కరోనాతో మాజీ ఎంపీ సురేంద్ర ప్రకాశ్‌ గోయల్‌ మృతి

కరోనా కాటుకు మరో ప్రజాప్రతినిధి బలయ్యారు. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ నాయకుడు, ఘజియాబాద్‌ మాజీ ఎంపీ సురేంద్ర ప్రకాశ్‌ గోయల్‌ శుక్రవారం మృతి చెందారు. గోయల్‌ మృతికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు సైతం సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

గోయల్ మృతిపట్ల మృతికి విశ్రాంత కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ జనరల్‌ వీకే సింగ్‌ సంతాపం తెలిపారు. 'సురేశ్‌ ప్రకాశ్‌ సింగ్‌ మృతి తీవ్రంగా కలచివేసింది. ఎంపీగా ఆయన ఘజియాబాద్‌కు ఎనలేని సేవలందించారు. ఆయన మృతి తీరని లోటు. సింగ్‌ ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top