Friday, 14 Aug, 2.15 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
ఒక్కరోజులోనే 1007 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190కి చేరింది. తాజాగా 1007 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040కి పెరిగింది.

తాజాగా 55,573 మంది కరోనా నుంచి కోలుకోగా..ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,555కి చేరింది. ప్రస్తుతం 6,61,595 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మరణాల్లో నాలుగో స్థానంలో ఉంది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top