Wednesday, 03 Jun, 12.13 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
సింగరేణి పేలుడుపై భాజాపా డిమాండ్ ఏంటంటే.. ?

సింగరేణి ఓసీపీ-1 గనిలో జరిగిన భారీ పేలుడులో నలుగురు కార్మికులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కోల్‌ మైన్స్‌ సేఫ్టీ అధికారులు తక్షణమే జరిపి నివేదిక ఇవ్వాలన్నారు.

మృతి చెందిన కార్మికులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు ఓబీ కాంట్రాక్టర్లు ..సింగరేణిలో అధికారులకు అక్షయపాత్రగా మారారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు కేటాయించిన పనులపై పర్యవేక్షణను సింగరేణి అధికారులు, యాజమాన్యం పట్టించుకోవటం లేదని విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>