Friday, 14 Aug, 2.15 pm TELUGU MEDIA.COM

తాజా వార్త లు
తెలంగాణ కరోనా రిపోర్ట్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 2వేల కొత్త కేసులు, పదిలోపు మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 1921 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 88,396కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 674కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,210 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 64,284కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 23,438 ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telugu Media
Top