Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
105 కోట్లతో రామాయణ తెలుగు రైట్స్ టాక్సిక్ తర్వాత కూడా దిల్ రాజు ధైర్యమేంటి

105 కోట్లతో రామాయణ తెలుగు రైట్స్ టాక్సిక్ తర్వాత కూడా దిల్ రాజు ధైర్యమేంటి

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మార్కెట్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సినిమాను ఎలా బిజినెస్ చేయాలి, ఏ టైమ్‌లో ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయంలో ఆయన ఆలోచించే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇటీవల రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టాక్సిక్' (Toxic) తెలుగు థియేట్రికల్ రైట్స్ విషయంలో ఒక ఊహించని మైండ్ గేమ్ ఆడారాయన. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఇండియాలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా పై కూడా ఉపయోగిస్తున్నారనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ థియేట్రికల్ రైట్స్ కొంటే.. సినిమా హిట్ అయితే లాభాలు వస్తాయి, ప్లాప్ అయితే ఆ నష్టాన్ని సదరు డిస్ట్రిబ్యూటరే భరించాలి.

కానీ దిల్ రాజు మాత్రం 'టాక్సిక్' విషయంలో 'రీఫండబుల్ బేసిస్' ఒప్పందంతో గ్రౌండ్ లోకి దిగారు. మొదట 'టాక్సిక్' రైట్స్ రూ.100 కోట్లకు పైగా అనుకున్నప్పటికీ, చివరికి రూ.75 కోట్లకు ఆ డీల్ సెట్ చేసుకున్నారట. పైగా సినిమా థియేటర్లలో సరిగ్గా ఆడకపోతే.. తాను పెట్టిన పెట్టుబడిని నిర్మాతలు తిరిగి ఇచ్చేయాలనే క్లాజ్ పెట్టుకున్నారట.

దీనివల్ల టాక్సిక్ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చినా కూడా, దిల్ రాజు సేఫ్ జోన్‌లోనే ఉండిపోయారు. ఎంత పెద్ద రిస్క్ ఉన్నా.. తను నష్టపోకుండా చూసుకునే ఈ 'రీఫండబుల్ బేసిస్' మైండ్ సెట్ ఇప్పుడు ట్రేడ్ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇప్పుడు ఇదే సేఫ్-ప్లే స్ట్రాటజీని మరో అతిపెద్ద పాన్ ఇండియా ఫిల్మ్ 'రామాయణం' పై ప్రయోగిస్తున్నారట.

నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, యష్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక చిత్రం 'రామాయణ'. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు ఏకంగా రూ.105 కోట్లతో డీల్ మాట్లాడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ చర్చల దశలోనే ఉంది. అయితే ఇక్కడ కూడా సేమ్ 'టాక్సిక్' ఫార్ములానే దిల్ రాజు అప్లై చేస్తున్నారట.

రూ.105 కోట్ల భారీ మొత్తాన్ని రీఫండబుల్ పద్ధతిలోనే నిర్మాతలకు ఆఫర్ చేసినట్లు సమాచారం. మన తెలుగు ప్రేక్షకులకు పౌరాణిక కథలంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. పైగా 'రామాయణం' లాంటి పౌరాణిక కథకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే థియేట్రికల్ పొటెన్షియల్ దిల్ రాజుకి బాగా తెలుసు. టికెట్ ధరలు, థియేటర్ల లభ్యత, ఆక్యుపెన్సీ ఎలా ఉన్నా.. ఒకవేళ సినిమా టాక్ అటు ఇటుగా అయినా కూడా తన పెట్టుబడికి ఢోకా లేకుండా 'రీఫండబుల్ పద్ధతి' ఆయన్ని సేఫ్ జోన్‌లో ఉంచుతుంది. [Dil Raju, Ramayana Movie, Toxic Movie, Yash]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One