ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కాగా ఈ హీట్ వేవ్ మరో వారం రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ నెల 26 వరకూ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు బుధవారం ( మే 20) నుంచి 26వ తేదీ వరకు మధ్య కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడి అనిపిస్తుంది.

