Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్ఆర్ పై డీసీ విజయం.. ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

ఆర్ఆర్ పై డీసీ విజయం.. ఢిల్లీ కేపిటల్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం

ఢిల్లీ క్యాపిటల్స్ కీలక సమయంలో అద్భుతంగా పుంజుకుంది. ఆదివారం (మే 17) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ఐపీఎల్ లో పతన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంటుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్ రాహుల్ 56 పరుగులు, , అభిషేక్ పోరెల్ 51 పరుగులతో జట్టు విజయానికి అవసరమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇక చివరిలో అశుతోష్ శర్మ 18 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ను మిచెల్ కట్టడి చేశాడు. 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పోరెల్ 31 బంతుల్లో 51 పరుగులు చేసి దూకుడుగా ఆడగా, రాహుల్ 42 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు.

వీరిద్దరూ ఔటయ్యాక ఢిల్లీ కాస్త తడబడింది. సాహిల్ పరాఖ్, రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్‌ అశుతోష్ శర్మ కేవలం 5 బంతుల్లోనే 18 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరం కాగా, అశుతోష్ ఫోర్, సిక్స్‌తో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 46 మెరుపు ఆరంభం ఇవ్వగా, ఆ తర్వాత రియాన్ పరాగ్ (51), ధ్రువ్ జురెల్ (53) అర్ధశతకాలతో రాణించారు. ఒక దశలో 160/2 స్కోరుతో రాజస్థాన్ 220 పరుగుల మార్క్ దాటేలా కనిపించింది. అయితే, డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్ మిచెల్ స్టార్క్ అద్భుతంగా పుంజుకున్నాడు. తన చివరి రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో రాజస్థాన్ చివరి ఆరు ఓవర్లలో 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 193/8 స్కోరుకు పరిమితమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One