Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడలకు ఎంపికైన ఆర్చర్ జ్యోతి సురేఖకి మంత్రి లోకేష్ అభినందన

ఆసియా క్రీడలకు ఎంపికైన ఆర్చర్ జ్యోతి సురేఖకి మంత్రి లోకేష్ అభినందన

అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు స్టార్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ బుధవారం (మే 20) ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు.

ప్రతిష్టాత్మక 2026 ఆసియా క్రీడలకు భారత జట్టులో ఆమె చోటు దక్కించుకున్నారు. వరుసగా నాలుగోసారి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి వెన్నం జ్యోతి సురేఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఆసియా క్రీడల్లో పోటీపడే అవకాశం దక్కించుకున్న జ్యోతి సురేఖను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

తన ప్రతిభతో విలువిద్య పోటీల్లో రాణిస్తూ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో సత్తా చాటి దేశ కీర్తిప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One