Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అద్దె కట్టలేక  భార్య, కూతురిని యజమానికి అప్పగించిన భర్త!

అద్దె కట్టలేక భార్య, కూతురిని యజమానికి అప్పగించిన భర్త!

మాజం తలదించుకునే అత్యంత హేయమైన, అమానవీయ ఘటన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగుచూసింది. కేవలం రెండు వేల రూపాయల ఇంటి అద్దె చెల్లించలేదనే నెపంతో, ఒక కన్న తండ్రి, భర్త తన కుటుంబ గౌరవాన్ని తాకట్టు పెట్టాడు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్యను, కన్న కూతురిని ఆకలి రాక్షసులైన ఇంటి యజమాని, అతని బంధువు చేతుల్లో పెట్టాడు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, మానవత్వానికే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. బతుకుదెరువు కోసం సురేంద్రనగర్ ప్రాంతం నుండి ఆరు నెలల క్రితమే మోర్బీ నగరానికి వలస వచ్చిన ఆ పేద కుటుంబానికి ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదు. మోర్బీ సిటీకి వలస వచ్చిన ఈ కుటుంబం నెలకు 2,000 రూపాయల అద్దెకు ఒక ఇల్లు తీసుకుంది.

అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో కొన్ని నెలలుగా ఇంటి అద్దె బాకీ పడిపోయింది. ఈ ఆర్థిక ఇబ్బందులనే అదనుగా మార్చుకున్న యాభై ఐదేళ్ల కామాంధుడైన ఇంటి యజమాని, ఆ అద్దె డబ్బులకు బదులుగా భయంకరమైన షరతు విధించాడు. బాకీ తీర్చకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడమే కాకుండా, ఆ అద్దె బదులుగా ఇంట్లోని ఆడవాళ్లను అప్పగించాలని ఒత్తిడి తెచ్చాడు. దారుణం ఏమిటంటే, ఆ కుటుంబానికి పెద్దగా ఉండి రక్షించాల్సిన భర్త, ఆ రాక్షస ఒప్పందానికి మౌనంగా అంగీకరించాడు.

భర్త అండ చూసుకున్న ఆ కామాంధుడు తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. కేవలం 13 ఏళ్ల ఏడు నెలల వయసున్న ఆ నిరుపేద బాలికపై, ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అద్దె ఇంట్లోనూ, యజమాని సొంత నివాసంలోనూ, అలాగే టంకారా ప్రాంతంలోనూ ఆ మైనర్ బాలికపై యజమాని పదేపదే అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేకాకుండా, ఆ యజమాని బంధువు కూడా ఈ ఘోరంలో భాగస్వామి అయ్యాడు.

భర్త భయంతోనో, సమాజానికి భయపడో ఆ అభాగ్యులు ఈ నరకాన్ని మౌనంగా భరిస్తూ వచ్చారు. కానీ, ఈ అమానవీయ చర్యల గురించి బాధితురాలి తల్లి మరియు అమ్మమ్మకు విషయం తెలియడంతో కథ అడ్డం తిరిగింది. ఈ ఘోరకలిని తెలుసుకున్న బాధిత మహిళ తల్లి మే 1వ తేదీన మోర్బీ సిటీ ఏ డివిజన్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అత్యంత కఠినమైన భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

నేరానికి సహకరించిన కిరాతక భర్తను మొదటగా అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత ప్రధాన నిందితుడైన 55 ఏళ్ల యజమానిని కూడా అదుపులోకి తీసుకుని, కోర్టు ముందు ప్రవేశపెట్టి ఒకరోజు కస్టడీ అనంతరం జుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణానికి సహకరించిన ఇతర పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చట్టం ముందు నేరస్థులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించబడాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One