Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Agnipariksha season 2 వీజే సన్నీ ఎంట్రీతో ఫుల్ ఫన్బ్లైండ్ కార్డులు కొట్టేసిన రోహిత్ దీపక్!

Agnipariksha season 2 వీజే సన్నీ ఎంట్రీతో ఫుల్ ఫన్బ్లైండ్ కార్డులు కొట్టేసిన రోహిత్ దీపక్!

గ్నిపరీక్షలో నిన్నటి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గా సాగింది. అసలేం జరిగిందో ఓసారి చూసేద్దాం.. ఎల్లో కార్డ్ టాస్క్ తర్వాత హౌస్‌లోకి వీజే సన్నీ ఎంట్రీ ఇచ్చాడు.

బిగ్ బాస్ ఇంట్లో ఉండే పరిస్థితులను తనదైన స్టైల్‌లో ఫన్నీగా చేసి చూపించాడు. కంటెస్టెంట్లను ఎంటర్‌టైన్ చేస్తూనే తనను ఇంప్రెస్ చేసిన వారికి మాత్రమే టాస్క్‌లో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలో రోహిత్, అపూర్వ కలిసి చేసిన డ్యాన్స్‌కు సన్నీ ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత షాలినీ, శ్రష్టి కూడా డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.

అమన్, షాలినీతో సన్నీ కాస్త ఫన్ చేశాడు. చివరకు రోహిత్, షాలినీలను టాస్క్‌కు ఎంపిక చేశాడు. ఆ టాస్క్‌లో రోహిత్ విన్ అయ్యి బ్లైండ్ కార్డ్ గెలుచుకుని ఆ కార్డును అభిజిత్ కి ఇచ్చాడు. ఆ తర్వాత పార్ట్ టైమర్స్ సిరీస్ ప్రమోషన్ కోసం తనూజ, జ్ఞానేశ్వరి వచ్చి వెళ్లారు.

ఆ తర్వాత ప్రియాంక జైన్ వచ్చి తనకు డిఫరెంట్‌గా ప్రపోజ్ చేసినవారికి అవకాశం ఇస్తానని చెప్తుంది. రోహిత్, హేమంత్, రామకృష్ణ ఫన్నీగా ప్రపోజ్ చేయగా దీపక్ కవిత్వంతో వెరైటీగా ప్రపోజ్ చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ప్రియాంక జైన్ దీపక్‌ను సెలెక్ట్ చేసింది. దీపక్ తన అపోనెంట్‌గా భాగిని ఎంచుకోవడంపై జ్యూరీ ప్రశ్నించింది.

చేయి బాగాలేదని తీసుకుంటున్నావా అని అడుగుతారు. ఇంకొకరి పేరు చెప్పమనగా శ్రష్టి పేరు చెప్పాడు. అయినా భాగి.. నేను ఆడతానని ముందుకు వచ్చింది. టాస్క్‌లో దీపక్ గెలిచి రెండో బ్లైండ్ కార్డ్ సొంతం చేసుకున్నాడు. [VJ Sunny Entry Agnipariksha 2, Rohit Blind Card Win, Deepak Blind Card, Priyanka Propose Task, Part Timers Web Series Promotion, Bigg Boss Telugu 10 Agnipariksha Tasks]

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One