Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Agnipariksha season2 ఫైనల్ లో బిందు మాధవి సంచలన నిర్ణయంభాగీకి ఓట్ అపూర్వకి షాక్

Agnipariksha season2 ఫైనల్ లో బిందు మాధవి సంచలన నిర్ణయంభాగీకి ఓట్ అపూర్వకి షాక్

బిగ్ బాస్ సీజన్ 10 కోసం జరుగుతున్న అగ్నిపరీక్ష సీజన్-2 పోటాపోటీగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో..టాస్కులన్నీ అయిపోయాక జ్యూరీలు అభిజిత్, బిందు మాధవి స్టేజ్ పైకి వచ్చారు.

ముందుగా బెస్ట్ ప్లేయర్ ని అనౌన్స్ చేయాల్సి ఉండగా అభిజిత్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రాజకుమారి పేరు చెప్పాడు. టీమ్ ని లీడ్ చేసిన విధానం.. టాస్కుల్లో చూపిన యాక్టివ్ నెస్ కి ఆమెకు మోస్ట్ వాల్యుయేబుల్ ప్లేయర్( MVP) ఇచ్చాడు. మోస్ట్ వాల్యుయేబల్ ప్లేయర్ గా సెలెక్ట్ అయిన రాజకుమారికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు.

తన టీమ్ లో నుంచి ఓట్ అప్పీల్ కి ఎవరిని పంపాలో తనే డిసైడ్ చేయాలి. రాజకుమారి వెంటనే తన గెలుపుకి కీలకంగా మారిన భాగీ పేరు చెప్పింది. ఎందుకంటే భాగీ తన 'స్టీల్ ది హాఫ్' కార్డుని టైమ్ కి వాడి టీమ్ ని గెలిపించింది. ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది.

లీడర్లు ముగ్గురిని పిలిచి వీకెస్ట్ ప్లేయర్స్ ఎవరో చెప్పమన్నారు. దానికి వాళ్లు ఏకగ్రీవంగా అపూర్వ పేరు చెప్పారు. గత కొన్ని ఎపిసోడ్లుగా అపూర్వ కేవలం మాటలతోనే టైమ్ పాస్ చేస్తోందని..టాస్కుల్లో ఎఫర్ట్ పెట్టడం లేదని అందరి ఫీడ్ బ్యాక్. అదే పాయింట్ ని పట్టుకుని బిందు మాధవి ఫైనల్ పంచ్ ఇచ్చింది.

నీ దగ్గర మాటలు ఉన్నాయి కానీ చేతల్లో చూపించడం లేదంటూ అపూర్వకి ఎల్లో కార్డ్ ఇచ్చేసింది. ఈ ఎల్లో కార్డ్ తో అపూర్వ ఇప్పుడు రెడ్ జోన్ కి చాలా దగ్గరగా వచ్చేసింది. మరో ఎల్లో పడితే డైరెక్ట్ గా ఇంటి నుంచి అవుట్ అవ్వాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu One